ఇంద్రకీలాద్రి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా దేవస్థానం

channel18
0

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


   ఈరోజు అనగా ది. 12-05-2024 న జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా దేవస్థానం నందు చిన్నరాజగోపురం దగ్గర శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి మందిరం దగ్గరలో ఆలయ కార్యనిర్వాహనాధికారి కె.ఎస్ రామరావు గారి సమక్షంలో ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ వేద పండితులు మరియు అర్చకులుచే జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారికి పంచామృత అభిషేకము, శంకర పూజ మరియు యతివందనం నిర్వహించడం జరిగినది. శ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనపాటి  మరియు పురాణ పండిట్ శ్రీ చింతలపాటి వెంకటేశ్వర శర్మ జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి యొక్క వైశిష్ట్యము ను  తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో  స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, వేద విద్యార్థులు, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.

ఈరోజు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్బంగా గుంటూరు లోని శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీపీఠం, శ్రీ సదనం నుండి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ గంబీరానంద భారతీ మహాస్వామి వారు విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహనాధికారి వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజి వారికి యతీశ్వర పూజ, పాదపూజ నిర్వహించి పండ్లు, వస్త్రములు అందజేయగా స్వామీజీ వారు అందరికీ అనుగ్రహభాషణం చేశారు. అనంతరం స్వామీజి వారికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించి పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు స్వామీజీ వారికి వేదస్వస్తి పలికారు. అనంతరం కార్యనిర్వాహనాధికారి వారు స్వామీజి వారికి పండ్ల, అమ్మవారి ప్రసాదములు అందజేయగా స్వామీజి వారు అందరికీ అనుగ్రహబాషణం చేశారు. 

  ఆదిశంకరాచార్యుల వారి జయంతి కార్యక్రమములను ఆలయమునకు విచ్చేసిన భక్తులు విశేషముగా తిలకించారు.

 అనంతరం సా.05 గం. లకు  లోక కళ్యాణార్థం, భక్తజన శ్రేయస్సు కొరకు మరియు హిందూ ధర్మ ప్రచార నిమిత్తం నగరోత్సవ కార్యక్రమం మహామండపం నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, కెనాల్ రోడ్, వినాయక స్వామి వారి గుడి, కెనాల్ రోడ్, రధం సెంటర్, దుర్గా ఘాట్ మీదుగా కొండపైకి చేరునని తెలిపి, భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కార్యనిర్వాహనాధికారి వారు కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">