దుర్గమ్మ సేవలో సుజనా చౌదరి
గత 45 రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆదివారం విజయవాడలో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేవాలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
వించిపేటలోని సీఎస్ఐ సెయింట్ జోన్స్ చర్చ్ ను సుజనా సందర్శించారు. పాస్టర్ తగరం శ్యాంబాబు సుజనాకు స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు చేసి విజయం సాధించాలని ఆశీర్వదించారు.
అనంతరం పంజా సెంటర్లోని లోటే చోటే మస్తాన్ వలీ దర్గాను సందర్శించారు. బాబూ మౌలానా దువ్వా చేసి ఆశీర్వదించారు.
ఒకే రోజులోనే దుర్గగుడి మసీదు చర్చిలను సందర్శించి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. సుజనా వెంట టిడిపి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ టిడిపి నాయకులు పేటేటి రాజా మోహన్ బిజెపి నాయకులు పైలా సోమి నాయుడు రౌతు రమ్యప్రియా లింగాల అనిల్ కుమార్ బిజెపి మైనారిటీ నాయకురాలు షేక్ మోబినా తదితరులు పాల్గొన్నారు.