ఓటు హ‌క్కు వినియోగించుకున్న కేశినేని శివ‌నాథ్ చిన్ని దంప‌తులు

channel18
0

 ఓటు హ‌క్కు వినియోగించుకున్న కేశినేని శివ‌నాథ్ చిన్ని దంప‌తులు



విజ‌య‌వాడ : టిడిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ఎంపి అభ్య‌ర్ధి గా పోటీ చేస్తున్న కేశినేని శివ‌నాథ్ (చిన్ని) దంప‌తులు వారి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. సోమ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఆంధ్ర ల‌యోల కాలేజీ పి.జి. బ్లాక్ రూమ్ నెంబ‌ర్ ఐ.పి.4 లో కేశినేని శివ‌నాథ్ త‌న క‌టుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఓటు వేశారు. కేశినేని శివ‌నాథ్ వెంట స‌తీమ‌ణి జాన‌కి లక్ష్మీ, కుమారుడు వెంక‌ట్, కూతురు స్నిగ్ధ‌, త‌ల్లి ప్ర‌సున్నాంబ వారి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల స‌ర‌ళిని గ‌మ‌నించారు. ఓట‌ర్లకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా, ఎన్నిక‌లు నిష్పాక్ష‌పాతంగా జ‌రిగేలా చూడాల‌ని ఎన్నిక‌ల అధికారుల‌ను కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">