మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కళ్యాణ్

channel18
0

 మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న  పవన్ కళ్యాణ్


 


జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో శ్రీ పవన్ కళ్యాణ్  కి ఓటు ఉంది. సోమవారం ఉదయం 9 గంటలకు మంగళగిరిలోని  లక్ష్మీ నరసింహా కాలనీ, గిరిజన సహకార సంస్థలో ఏర్పాటు చేసిన బూత్ నంబర్ 197లో ఓటు వేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సిరా గుర్తు ఉన్న వేలును చూపుతూ అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ప్రశాంత వాతారణంలో ఎన్నికలు జరగాలని, ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. శ్రీమతి అనా కొణిదెల కి భారత దేశంలో ఎన్ని కల ప్రక్రియ, ఓటింగ్ సరళిని చూపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">