*08-06-2024 విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో*
ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు సంతాప సభ
ఎంపి కేశినేని శివనాథ్ కార్యాలయంలో చెరుకూరి రామోజీరావు కి ఘన నివాళులర్పించిన టిడిపి నాయకులు
రామోజీరావుకి నివాళులర్పించి సంతాపం ప్రకటించిన టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్,విజయవాడ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, బొప్పన భవకుమార్, వేద వ్యాస్, మాదిగాని గుర్నాథం
పట్టాభి పాయింట్స్
అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు ఆకస్మిక మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.
తాను నమ్మిన సిద్దాంతాలు, విలువలకి కట్టుబడి జీవన ప్రయాణం సాగించిన వ్యక్తి రామోజీరావు.
ఈనాడు పత్రిక స్థాపించిన నాటి నుంచి వాస్తవాలను ప్రజలకు చెరువ చేయటంలో ముందు వుండేవారు
కేవలం ఆధారాలతో కూడిన వార్తాలను మాత్రమే ప్రచురించేవారు.
ఒత్తిళ్లు, దాడులు ఎదురైనా రాజీ పడకుండా పోరాడిన వ్యక్తి రామోజీరావు.
ఎపిలో ఓ నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షనా రామోజీరావు అక్షర పోరాటం చేశారు.
వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత లాభాల వెనుక పరిగెత్తుకుండా తను నమ్మిన లక్ష్యంగా నిలబడి అడుగు వెనక్కి వేయకుండా పోరాడిన వ్యక్తి చెరుకూరి రామోజీరావు
జూన్ 4వ తేదీ మనందరిలాగానే రామోజీరావు ఎంతో ఆనంద పడివుంటారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన ఫలితాలకి ఎంతో సంతోషపడి...ఆ భగవంతుడి దగ్గరికి చేరుకొని వుంటారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ది కోసం ముందుండి అక్షర పోరాటం చేశాడు.
రామోజీరావు పత్రికా రంగంలో ఒక దిగ్గజం.
ప్రకృతి విపత్తులు సంభవించినట్లు ముందుండి ఎంతోమందికి నివాస గృహాలు నిర్మించి పేద ప్రజలను ఆదుకున్నారు.
రామోజీరావు ఒక మచ్చలేనట్టువంటి వ్యక్తి. అందుకే ఆయన తెల్లని వస్త్రాలు ధరిస్తాడని భావిస్తాను.
ఆయన భౌతికంగా మన మద్య లేకపోవటం బాధకరం..
మాలాంటి యువనాయకులకి రామోజీరావు ఒక దిక్సూచి..
కోనేరు శ్రీధర్ పాయింట్స్
రైతు కుటుంబంలో జన్మించి...భారతదేశ పత్రికా రంగంతో తన కంటూ ఓ స్థానాన్ని, ప్రత్యేకతను రామోజీరావు ఏర్పాటు చేసుకున్నాడు.
ఈనాడు స్థాపించిన కొత్తలో ఉచితంగా దినపత్రికను పంపిణీ చేయగా, ఈనాడు సంస్థ దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరింపచేశాడు.
ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వటంతో...ఉపాధి మార్గాలు చూపించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు.
రామోజీరావు తెలుగు భాష కోసం...రైతుల సంక్షేమం ఎంతోగానో కృషి చేశారు.
ఈనాడు పత్రికా ద్వారా అన్ని వర్గాల ప్రజలకు కావాల్సిన సమాచారం అందించేవాడు.
బొప్పన భవకుమార్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రామోజీరావు తెలియని వ్యక్తి వుండడు..
అనేక సంస్థలు స్థాపించి దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఉద్యోగావకాశాలు కల్పించాడు.
రాజకీయం రంగంతో పాటు..సినిమా రంగంలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న వ్యక్తి రామోజీరావు.