12-06-2024
కేంద్రమంత్రులు, మహారాష్ట్ర సీఎంలకు స్వాగతం పలికిన ఎంపి శివనాథ్
చిన్ని
నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్, సీఎం ఏకనాథ్ షిండే రాక
గన్నవరం విమానాశ్రయంలో కేశినేని శివనాథ్ సందడి
గన్నవరం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన కేంద్రమంత్రులు, మహారాష్ట్ర సీఎం, ఎంపీలకు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే వేచి వుండి ముంబై, ఢిల్లీల నుంచి ప్రత్యేక విమానాల్లో వచ్చిన కేంద్రమంత్రి చిరాగ్ కుమార్ పాశ్వాన్, రాజ్యసభ ఎంపి ప్రఫుల్ పటేల్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేలకు పూలబోకే అందించి స్వాగతం చెప్పారు. అనంతరం వారిని ఎయిర్ పోర్ట్ వెలుపల వెహికల్స్ ఎక్కించి సభాస్థలికి పంపించారు. ముందుగా కేంద్రమంత్రి చిరాగ్ కుమార్ పాశ్వాన్ రాగా, ఆ తర్వాత రాజ్యసభ ఎంపి ప్రఫుల్ పటేల్, కాసేపటి అనంతరం నితిన్ గడ్కరీ, ఏక్ నాథ్ షిండే లు రావటం జరిగింది. వీరందరికి కేశినేని శివనాథ్ తో పాటు అమలాపురం ఎంపి గంటి హరీష్ మాథూర్ కూడా స్వాగతం చెప్పారు. అతిధులకు స్వాగతం పలికే సమయంలో కేశినేని శివనాథ్ చాలా ఉత్సాహంగా ఎయిర్ పోర్ట్ లో అటు ఇటు తిరుగుతూ సందడిగా కనిపించారు.