ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో అధికారుల కృషి భేష్‌ స‌జావుగా, ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు

channel18
0

 *ఎన్‌టీఆర్ జిల్లా, జూన్ 06, 2024*


ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో అధికారుల కృషి భేష్‌

స‌జావుగా, ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు

జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు


ఎన్‌టీఆర్ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వ‌హించ‌డంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు.

జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు గురువారం క‌లెక్ట‌రేట్ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్‌పుండ్క‌ర్, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ శుభం నోఖ్వాల్ త‌దిత‌రుల‌తో క‌లిసి రిట‌ర్నింగ్, స‌హాయ రిట‌ర్నింగ్ అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. సీఈవో కార్యాల‌యానికి వివిధ ఫారాల‌తో అందించాల్సిన నివేదికల‌పై సూచ‌న‌లు చేశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియతో పాటు వీటి స‌న్న‌ద్ధ‌తా కార్య‌క‌లాపాల్లో రిట‌ర్నింగ్ , స‌హాయ రిట‌ర్నింగ్‌, ఇత‌ర అధికారులు, సిబ్బంది ఎంతో అంకితభావం, నిబద్దతతో వ్యవహరిస్తూ విధులు నిర్వర్తించారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న జిల్లా ఎన్నికల పరిశీలకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్‌, కౌంటింగ్ ప్రక్రియల సంద‌ర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించిన జిల్లా పోలీస్ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.

    పోలింగ్‌, ఓట్ల లెక్కింపు కార్యక్రమాలు ప్రశాంత వాతావ‌ర‌ణంలో ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో నిర్వహంచడంలో సహకరించిన రాజకీయ పక్షాల ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా రూప‌క‌ల్ప‌న ద‌గ్గరి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశలో ఆయా అధికారులు, సిబ్బంది తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారని కలెక్టర్ కొనియాడారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియతో పాటు ఈసీఐ నూతనంగా ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములైన బృందాలకు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఎన్నికల ప్రక్రియలో అన్ని విధాలా సహకరించిన జిల్లా ప్రజలకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది, జిల్లా అధికారులు, వివిధ విభాగాల నోడల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్‌లు, సెక్టార్ అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవ‌ర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, జిల్లా స్ధాయి నుంచి గ్రామ స్ధాయి వరకూ అన్ని శాఖల అధికారులు, ఇతర ఎన్నికల అధికారులు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులకు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియ‌జేశారు.


*క‌లెక్ట‌ర్‌ను స‌త్క‌రించిన స‌ర్వోద‌య ట్ర‌స్ట్‌:*

అత్యంత పార‌ద‌ర్శ‌క‌తతో జ‌వాబుదారీత‌నంతో ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో విజ‌య‌వంతంగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించిన జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావును స‌ర్వోద‌య ట్ర‌స్ట్ ప్ర‌తినిధులు ఘ‌నంగా స‌త్క‌రించారు. ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న ద‌గ్గ‌రి నుంచి ఫ‌లితాల వెల్ల‌డి వ‌ర‌కు ప్ర‌తి ద‌శ‌లోనూ క‌లెక్ట‌ర్ డిల్లీరావు ప్ర‌శంసాపూర్వ‌క విధులు నిర్వ‌హించిన‌ట్లు ఈ సంద‌ర్భంగా స‌ర్వోద‌య ట్ర‌స్టు సీనియ‌ర్ సిటిజ‌న్స్ ఫోరం ప్ర‌తినిధులు మోత్కూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, వేమూరి బాబూరావు పేర్కొన్నారు.

స‌మావేశంలో రిట‌ర్నింగ్ అధికారులు బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, ఎ.ర‌వీంద్ర‌రావు, కె.మాధ‌వి, జి.వెంక‌టేశ్వ‌ర్లు, ఇ.కిర‌ణ్మ‌యి త‌దిత‌రులు ఉన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">