కుంగ్ ఫూ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్ష‌ణ పొందిన విద్యార్థుల‌కు స‌ర్టిఫికెట్ల పంపిణీలో మాస్ట‌ర్స్ సిజో నారాయ‌ణ‌రావు, సిఫు బోడా వెంక‌ట్‌, మాస్ట‌ర్ పి.ర‌సూల్‌

channel18
1 minute read
0

 ఆత్మరక్షణ, ఆరోగ్య పరిరక్షణకు మార్షల్ ఆర్ట్స్ దోహదం.


కుంగ్ ఫూ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్ష‌ణ పొందిన విద్యార్థుల‌కు స‌ర్టిఫికెట్ల పంపిణీలో మాస్ట‌ర్స్ సిజో నారాయ‌ణ‌రావు, సిఫు బోడా వెంక‌ట్‌, మాస్ట‌ర్ పి.ర‌సూల్‌



తాడేప‌ల్లి:- మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఆత్మరక్షణతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ఎంత‌గానో దోహదపడుతుందని షావోలిన్ మంక్స్ కుంగ్ ఫూ అకాడమి ఇండియా వ్యవస్దాపక గ్రాండ్ మాస్ట‌ర్ సిజో డాక్ట‌ర్ ఎం.నారాయణరావు, సాయి సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ (విజ‌య‌వాడ‌) వ్య‌వ‌స్థాప‌కులు సిఫు. బోడా వెంకట్, మాస్ట‌ర్ పఠాన్ కాజా నాయబ్ ర‌సూల్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు సమాజంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఆవశ్యకతను వివరించారు. శ‌నివారంనాడు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వండ‌ర్ ఫిట్‌నెస్ జిమ్‌లో జ‌రిగిన షావోలిన్ మాంక్స్ కుంగ్ ఫూ అకాడమీ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందిన విద్యార్దులకు సంస్ధ వ్యవస్థాపక గ్రాండ్ మాస్టర్ సిజో నారాయణరావు ఆధ్వర్యంలో సాయి సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, నూరి సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వ‌ర్యంలో మార్షల్ ఆర్ట్స్, మాస్టర్స్ టీం సారధ్యంలో కుంగ్ ఫూ బెల్ట్ గ్రేడింగ్ ప‌రీక్ష‌ను నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌రావు, బోడా వెంక‌ట్‌, మాస్ట‌ర్ ర‌సూల్ మాట్లాడుతూ, కుంగ్ ఫూ మార్ష‌ల్ ఆర్ట్స్లో శిక్ష‌ణ పొంద‌డం ద్వారా ఆత్మ‌ప‌రిర‌క్ష‌ణ‌, ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. ముఖ్యంగా ప్ర‌స్తుత ప‌రిస్తితుల్లో బాల‌బాలిక‌లు కుంగ్ ఫూ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్ష‌ణ పొంద‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌న్నారు. బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన షావోలిన్ మాంక్స్ కుంగ్ ఫూ అకాడమీ సబ్ జూనియర్ లెవెల్ విద్యార్థినీ విద్యార్థులు ఎల్లో బెల్ట్స్ గెలుపొందార‌ని తెలిపారు. వారితో పాటు తమ సంస్ధలో సుదీర్గ శిక్షణ పొందిన సీనియర్ విద్యార్థులు బి.ముత్యాలరావు, కె.ఉమామహేశ్వరరావు బ్లాక్ బెల్ట్‌లు కైవసం చేసుకోవడం ఆనంద‌దాయ‌క‌మ‌ని పేర్కొన్నారు. కుంగ్ ఫూ బెల్ట్ గ్రేడింగ్ ప‌రీక్ష‌కు చిలకలూరిపేట న్యూ షావోలిన్ కుంగ్ ఫూ అకాడమీ సీనియర్ కుంగ్ ఫూ మాస్టర్ ఎస్.కె.దరియావలి, సిఫు బి.విక్రమ్‌లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బెల్ట్‌లు సాధించిన విద్యార్థులకు, వారికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చిన ప్రధాన శిక్షకులు సిఫు బోడా వెంకట్, కోచ్ పి.రసూల్ మాస్టర్‌కు మాస్ట‌ర్ ఆర్ట్స్ మాస్ట‌ర్స్ టీం త‌ర‌ఫున పూసపాటి మురళీ కృష్ణంరాజు అభినంద‌న‌లు తెలిపారు

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">