ప్రజా తీర్పును గౌరవిద్దాం... ప్రజల్లోనే ఉందాం, సమస్యలపై పోరాడదాం
కార్యకర్తలకు మనో ధైర్యం ఇచ్చిన వెలంపల్లి శ్రీనివాసరావు
ప్రజాసేవలోనే ఉంటానని హామీ
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని పశ్చిమ మాజీ శాసనసభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, తన కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో తన వెంట నడిచిన వారిని తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. గెలిచినా.. ఓడినా.. తాను ప్రజల మనిషిని అని.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని.. మనోధైర్యం చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.