ఈనాడు సంస్థల చైర్మన్ చెరుకూరి
రామోజీరావు భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు
శనివారం నాడు హైదరాబాద్ లో రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు అనంతరం మాట్లాడుతూ
సామాన్య రైతు కుటుంబం లో పుట్టి అంచలంచెలుగా ఎదిగి లక్షలాది మందికి జీవనోపాధి చూపించి పత్రికా రంగం తో పాటు అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావు మరణం చాలా భాధకరమని వారి అత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు