పసుపు కూటమి సృష్టించిన సునామీలో వైసీపీ, వసూల్ బ్రదర్స్ కొట్టుకుపోయారు ప్రజలు తిరగబడి తరిమి కొట్టారు
వెల్లువెత్తిన ప్రజాభిమానం
నందిగామ పట్టణం (5వ వార్డు) - 6 జూన్ 2024
ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనకు విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో తిరుగుబాటు చేసి కూటమి అభ్యర్థులకు అత్యథిక మెజారిటీతో ఘనవిజయాన్ని ఇచ్చారని నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయనని, నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు.
కాగా, కూటమి నందిగామ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో ఎన్నికైన శ్రీమతి తంగిరాల సౌమ్యకు నియోజకవర్గ ప్రజల నుంచి అభినందనలు వెళ్లువెత్తాయి. గురువారం తెల్లవారుజామునుంచే అభిమానులు సౌమ్య శుభాకాంక్షలు తెలపడానికి పోటెత్తారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగన్‌వాడీలు వివిధ శాఖల ఉద్యోగులు సౌమ్యకు శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం వరకు కొనసాగింది.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఎమ్మెల్యేగా శ్రీమతి తంగిరాల సౌమ్య త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనుకున్న కోరిక ఫలించడంతో గురువారం నందిగామ పట్టణంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో 108 కొబ్బరికాయలు కొట్టి కూటమి నేతలు మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో తంగిరాల సౌమ్య కూటమి గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం ఆమె టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లారు.