ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపిన నల్లమిల్లి
అనపర్తి నియోజకవర్గం NDA కార్యాలయంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు చిత్ర పటానికి నివాళులర్పించిన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
.
అనంతరం అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ
1. తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా పెంచింది నందమూరి తారక రామారావు అయితే తర్వాతి స్థానంలో రామోజీరావు నిలుస్తారు. భారత ప్రభుత్వం అత్యున్నతమైన పురస్కారం పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది.
2.మీడియా రంగంలోనే ఒక సంచలనం సృష్టించిన రామోజీరావు. రామోజీ ఫిలిం సిటీ నిర్మించి ఒక అద్భుతం సృష్టించారని, ఆయన ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన కుటుంబానికి, రామోజీ ఫిలిం సిటీ సిబ్బందికి, ఈనాడు సిబ్బందికి తన సానుభూతిని ప్రకటిoచిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం NDA నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.