భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్
బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ తో భేటీ అయిన బిజెపి జాతీయ కార్యదర్శి, ధర్మవరం బిజెపి ఎమ్మెల్యే వై సత్య కుమార్
సత్య కుమార్ ని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, ఓబీసీ మచ్చ జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీ శ్రీ నివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక, బిజెపి అధికార ప్రతినిధి యామినీ శర్మ, ప్యానల్ లిస్ట్ పాటి బండ్ల రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బి ఎస్ కే పట్నాయక్ తదితరులు సన్మానించారు
విజయవాడ
ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే వై.సత్యకుమార్ కామెంట్స్*
2024 ఎన్నికల ఫలితాలు చూసుకుంటే వైసీపీ పాలన చేసిన అకృత్యలకి చెంప పెట్టు లాంటిది
రాష్ట్రంలో వైసీపీ పాలన తో ఏపీ వెనుకపడిపోయింది
గత పది సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా మోదీ ఆధ్వర్యంలో అభివృద్ధి చూసి ప్రజలందరూ NDA కూటమికి మద్దతు తెలియచేస్తున్నారు
ఒరిస్సా రాష్ట్రంలోనే సొంతంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూనే ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
అవినీతి, అక్రమ పాలన కి వ్యతిరేకంగా ప్రజలు NDA కూటమికి మద్దతు తెలియచేసారు
తాడేపల్లి కి పరిమితమైన వైసీపీ అధినేత జగన్ తన మైండ్ సెట్ ని మార్చుకోకుండా ప్రజల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు
సంక్షేమ పథకాలు ఇచ్చాను అని ప్రజలని అనుమానిస్తున్నారు
రాష్ట్రంలో నాశిరకమైన మద్యాన్ని ఏదేశ్చగా అమ్మకాలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు
రైతులకి సాగు నీరు అందించకుండా రైతులు ఆత్మహత్యలకి కారణమయ్యారు
గ్రామాల్లో మౌలిక సదుపాయల కోసం ఉపాధి పథకం ఉంటే వాటి కోసం వైసీపీ నాయకులు కమిషన్ కోసం కక్రుత్తి పడ్డారు
ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసి ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి అరాచక పాలన సాగించారు
ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకి దిగి కేసు లు పెట్టి అనేక విధాలుగా ఇబ్బందులకి గురి చేశారు
అందుకే రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి ఓటు హక్కు తో వైసీపీ కి బుద్ది చెప్పి,రాష్ట్ర అభివృద్ధి NDA కూటమినే సరైన దారి ని ప్రజలు ఎన్నుకున్నారు
ధర్మవరం లో నన్ను గెలిపించిన ప్రజానీకానికి మా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను
రాష్ట్ర అభివృద్ధి తో పాటు సంక్షేమ కార్యక్రమాల కి NDA కూటమి శ్రీకారం చూడుతుంది
కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు
వైసీపీ వ్యతిరేక ఓటు ని చిల్చకుండా పవన్ కళ్యాన్ తీసుకున్న నిర్ణయం గొప్పది
అటు బీజేపీ తో ఇటు టీడీపీ తో సమన్వయం చేసుకుంటూ కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాన్ కీలక పాత్ర గా చెప్పాలి