తెలుగు ప‌త్రికా రంగాన్ని మ‌లుపు తిప్పిన అక్ష‌ర‌యోధుడు చెరుకూరి రామోజీరావు : ఎంపి కేశినేని శివ‌నాథ్ రామోజీరావు కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి

channel18
0

 08-06-2024


తెలుగు ప‌త్రికా రంగాన్ని మ‌లుపు తిప్పిన  అక్ష‌ర‌యోధుడు చెరుకూరి రామోజీరావు  : ఎంపి కేశినేని శివ‌నాథ్ 

రామోజీరావు కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి 


ఢిల్లీ :  తెలుగునాట ఈనాడు దినపత్రికను స్థాపించి..  పత్రికా లోకంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన‌ చెరుకూరి రామోజీరావు  మృతి వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని  విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు.  ఢిల్లీ లో శ‌నివారం టిడిపి అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు క‌లిసి రామోజీరావు చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు.   పత్రికా రంగానికి,  ఎలక్ట్రానిక్ మాధ్యమాల విస్త‌ర‌ణ‌కు వార్త‌లు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు స‌త్వ‌రం చేర‌టానికి అసాధార‌ణ‌మైన కృషి చేసిన రామోజీరావు  మ‌రణం ప‌త్రిక రంగానికి  తీరని లోటని సంతాపం వ్య‌క్తం చేశారు. అలాగే ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ఆ భ‌గవంతుడ్ని ప్రార్ధించారు. 

అనంతరం కేశినేని శివ‌నాథ్ రామోజీరావు ప‌త్రికా రంగానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు.తెలుగు ప‌త్రికా రంగాన్ని మ‌లుపు తిప్పిన  అక్ష‌ర‌యోధుడు చెరుకూరి రామోజీరావు అని కొనియాడారు.  తెలుగుప్రజల్లో దినపత్రికల పట్ల ఆసక్తిని, అభిరుచులను పెంపొందించడంలో రామోజీరావు  విశేషమైన కృషి చేశాడ‌ని తెలిపారు..   ఈనాడు డైలీ పేప‌ర్ కి అనుబంధంగా అన్నదాత, విపుల, చతుర,  సితార, తెలుగు వెలుగు లాంటి పత్రికలను స్థాపించి ప్రజల్లో,పాఠ‌కుల్లో ఉత్తమ సాహితీ పఠనాశక్తిని కలిగించిన పత్రికా దార్శనికుడు. అలాగే మారిన కాలానికి అనుగుణంగా ఈటీవీ, ఈటీవీ న్యూస్ శాటిలైట్ చానెల్స్ ప్రారంభించి, ఆయన జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించాడని పేర్కొన్నారు. 

రామోజీరావు  లేని లోటు పత్రికా రంగానికే కాదు, తెలుగు సాంస్కృతిక రంగానికి తీరని వెలితిగా భావిస్తూ.. రామోజీరావు  కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ స‌భ్యులందరికీ సానుభూతిని కేశినేని శివ‌నాథ్ తెలియ‌ప‌ర్చారు

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">