ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభాకాంక్షలు,
కూటమికి దక్కిన ఈ అరుదైన విజయం రాష్ట్రంలో
అన్ని ప్రాంతాల వారి కులాల వారి అన్ని మతాల వారి సమిష్టి విజయం. ఈ గెలుపు ఏ ఒక్క కులం సంకల్పం కాదు ఇది ఆంధ్ర ప్రజల సంకల్పం. ఇది రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజల సమిష్టి విజయం. కులాల కుమ్ములాటలలో విద్వేషాలతో పబ్బం గడుపుకోవాలి అని చూసిన వారి రాజకీయాన్ని ప్రజలు అసహ్యించున్నారు.వారి వైఖరి వారి నైజం ఇంక చాలు సర్దుకోండి అని స్పష్టమైన తీర్పు ఇచ్చారు.ఇప్పటిదాకా ఆంధ్ర ప్రజలకు తమ భవిష్యత్తు కన్నా, తమ బిడ్డల కన్నా,తమ రాష్ట్ర భవిష్యత్తు కన్నా, కుల పక్షపాతానికి ప్రాధాన్యత ఇస్తారని నింద మోస్తూ పక్క రాష్ట్రాల వారి ముందు నవ్వుల పాలవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం స్పందించిన ఈ సంఘటిత తీర్పుని గౌరవిద్దాం. అందరికీ అందరూ ఎవరికీ తోచిన రీతిలో వారు కృషి చేశారు. ఇక మన కర్తవ్యం ప్రజలు ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకొని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ నాయకత్వం (NDA గవర్నమెంట్) చేసే కృషికి మన వంతు నైతిక మద్దతు ఇవ్వడమే. ఓటమిలో పోరాటాన్ని చేసాము,నేడు గెలుపులో వినయాన్ని ప్రదర్శిద్దాము.
ఇట్లు,
జాతీయ బీసీ సంక్షేమ సంఘం,
పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు.. శీరం నాగమల్లేశ్వరరావు