06-06-2024
ఎన్డీయే పక్ష ఎంపిల సమావేశానికి హాజరు కానున్న కేశినేని శివనాథ్ గురువారం రాత్రి ఢిల్లీకి పయనం
ఉండవల్లిలో పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు
విజయవాడ : విజయవాడ పార్లమెంట్ మెంబర్ గా గెలిచిన కేశినేని శివనాథ్ గురువారం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి అందుబాటులో వున్న ఎంపీలు హాజరు కాగా, మిగిలిన ఎంపిలు జూమ్ కాల్ ద్వారా టిడిపిపిలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో ముందుగా చంద్రబాబు నాయుడు ఎంపిలు గా గెలిచిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రజలిచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని, ఈ విజయాన్ని సమాజ సేవకు వినియోగించాలని చెప్పారు. ఇక ఢిల్లీలో శుక్రవారం జరగబోయే ఎన్డీయే పక్ష ఎంపిల సమావేశానికి హాజరుకావాల్సి వుండటంతో కేశినేని శివనాథ్ గురువారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో ఢిల్లీ బయలుదేరారు.