స్ఫూర్తిప్రదాత రామోజీరావు
విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీయూడబ్ల్యూజే నేతలు నివాళి
మీడియా మొగల్, ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం పత్రికా రంగానికే కాక, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళుర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగు జర్నలిజానికి జాతీయస్థాయిలో ఒక గుర్తింపును, గౌరవాన్ని తీసుకురావడమేగాక, జిల్లా పేజీలతో స్థానిక వార్తలకు అత్యంత ప్రాధాన్యనిచ్చి తెలుగు పత్రికారంగంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన స్ఫూర్తి ప్రధాత అని కొనియాడారు. అలాగే తెలుగు భాష సంరక్షణకు, సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేశారని, రంగం ఏదైనా విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేసిన వ్యక్తి రామోజీరావు అని శ్లాఘించారు. ఆయన మృతి పత్రికారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయప్రకాష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచల జయరాజ్, ఐజేయూ సభ్యులు షేక్ బాబు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు దారంవెంకటేశ్వరరావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీిహెచ్ రమణారెడ్డి, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు సాంబశివరావు, విజయవాడ యూనిట్ కార్యవర్గ సభ్యులు రత్నాకర్, హుస్సేన్, కుమార్, తిరుమలరావు, శ్రీనివాస్, భద్రం, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు