6-06-2024
ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
విజయవాడ : మైలవరం ఎమ్మెల్యే
వసంత కృష్ణప్రసాద్ గురునానక్ కాలనీ లోని ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.విజయవాడ పార్లమెంట్ లో ఎంపి గా ఘనవిజయం సాధించిన సందర్భంగా పూలబోకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచి వసంత కృష్ణప్రసాద్ కు కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ఒకరినొకరు శాలువతో సత్కరించుకున్నారు. ఇక వసంత కృష్ణప్రసాద్ తో పాటు వచ్చిన ఆ నియోజకవర్గ పార్టీ నాయకులు కూడా కేశినేని శివనాథ్ కు శుభాకాంక్షలు చెప్పారు . పార్టీ గెలుపు కోసం కష్టపడినవారందరికీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.