ఎర్రచందనం దొంగలు అరెస్టు 63 దొంగలు పట్టివేత
కడప జిల్లా:
వనిపెట అటవీ రేంజ్ పరిధిలోని రిజర్వు అడవిలోనికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారని సమాచారం రావడంతో జిల్లా అటవీ శాఖాధికారి కడప పి.వి. సందీప్ రెడ్డి మరియు సబ్ డివిజనల్ అటవీ అధికారి ఆదేశాలు ప్రొద్దుటూరు ఎన్.వి. దివాకర్ మరియు వనిపెంట అటవీ క్షేత్రాధికారి జె.ప్రజేత్ రావు ఉత్తర్వుల మేరకు వనిపెంట రేంజ్ సిబ్బంది అడవిలో కూంబింగ్ నిర్వహిస్తుండగా కొంతమంది దుండగులు ఎర్రచందనం చెట్లను నరుకుతూ, వాటిని చెక్కుడు చేసి దుంగలుగా మారుస్తూ కనిపించారు. వారి లో ముగ్గురు వ్యక్తులు పట్టుబడగా వారిని అటవీ సిబ్బంది పట్టుకొన్నారు మిగిలిన వారు పారిపోయినారు. అక్కడ దొరికిన 63 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్నామని రేంజర్ తెలిపారు - పారిపోయిన వృత్తులను అరెస్టు చేయడానికి విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని రేంజర్ తెలిపారు.
ఈ ఆపరేషన్ లో డిఆర్టో అన్వర్ హుస్సేన్, బేట్ అధికారులు ఈశ్వరమ్మ, సురేంద్ర, గంగాధర్ మరియు ప్రొటక్షన వాచర్లు పాల్గొన్నారు.