విద్యార్థుల ప్రతిభకు నిరంతరం తోడ్పాటు,ప్రోత్సాహకాన్ని అందిస్తున్న శ్రీ సాయి ఆరాధన క్షేత్రం షిరిడి, విజయవాడ వారికి ప్రత్యేక అభినందనలు.
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.
చందర్లపాడు మండలం - 02 ఆగస్టు 2024.
కోనయపాలెం గ్రామం నందు శుక్రవారం నాడు 2023-2024 వ వార్షిక సంవత్సరమునకు గాను పదవ తరగతిలో 400కు పైగా మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు శ్రీ సాయి ఆరాధన క్షేత్రం షిరిడి, విజయవాడ వారి ఆధ్వర్యంలో స్కాలర్ షిప్ లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతులు మీదుగా ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్కాలర్ షిప్ లు అందుకున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు, ఆశీస్సులు నేటి యువతే రేపటి భవిత ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని మనం ఎంత ఉన్నత స్థానంలో ఉన్న మన పుణ్యభూమిని సొంత ఊరును మరచిపోకూడదు. మన తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న ఆశలను సాధించే దిశగా తల్లిదండ్రులకు మంచి పేరును తెచ్చే విధంగా ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులు బాగా చదువుకోవాలి. కలలు కనండి కలలు సహకారం చేసుకోండి అని ప్రపంచ దేశాలు గర్వించదగిన మిస్సైల్ మెన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన మాటలు ఎప్పుడూ మనకి నిద్రలో ఉన్న వినపడాలి. ఇంతటి మంచి కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యం వారికి, ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి మహంకాళి మోహన్ రావు,మాజీ జెడ్పిటిసి సభ్యులు, స్థానిక ఎంపీటీసీ,సర్పంచ్,ఎన్డీఏ నేతలు, విద్యార్థినీ విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.