ప్రముఖ పిల్లల వైద్య నిపుణురాలు వి.శ్రీదేవి

channel18
0

త‌ల్లి పాల‌తో బిడ్డ‌కు లాభాలు అనేకం


ప్రముఖ పిల్లల వైద్య నిపుణురాలు వి.శ్రీదేవి



విజ‌య‌వాడ‌:- “తల్లిపాలు అమృతమే కాదు, అద్భుతం కూడా. రక్తంలో ఉండే యాంటీబాడీస్ కంటే తల్లిపాలల్లో ఉండే వ్యాధినిరోధక కణాలు 2వేల రెట్లు ఎక్కువ. పోతపాలు కంటే తల్లిపాలతో బిడ్డకి కలిగే లాభాలు అనేకం అనడంలో ఎటువంటి సందేహం లేదు” అని ప్రముఖ పిల్లల వైద్య నిపుణురాలు వి.శ్రీదేవి అన్నారు. వాసవ్య నర్సింగ్ హెూమ్‌లో డాక్ట‌ర్ స‌మరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె పాల్గొని "తల్లిపాల ప్రాధాన్యత" అంశంపై మాట్లాడుతూ, తల్లిపాలకి మించిన పాలు ఏవీ లేవని, చంటి బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంపొందించి, సాధారణ వ్యాధులు నుండి రక్షణ కలిగిస్తాయని అన్నారు. తల్లిపాలు వల్ల బిడ్డకి సంరక్షణ కలగడమే కాకుండా తల్లికి కూడా మంచి ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. తల్లికి బ్రెస్ట్ కేన్సర్, ఒవేరిన్ కేన్సర్, ఎనీమియా, ఆస్టియోపోరోసిన్ వంటి ఎన్నో వ్యాధులు నుండి రక్షణ చేకూరుతుందని, ఒబేసిటి కూడా తగ్గుతుందని అన్నారు. కాన్పు తర్వాత వెంటనే తల్లిరొమ్ము పట్టిస్తే అధికంగా అయ్యే రక్తస్రావం అరికట్టబడుతుందన్నారు. బిడ్డకు 6మాసాలు నిండే వరకు తల్లిపాలే ఇవ్వాలన్నారు. బిడ్డ‌కు పాలిస్తే తల్లి అందం చెడుతుందనే దాంట్లో అర్థం లేదన్నారు. తల్లీ బిడ్డా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే తల్లిపాలే కావాలన్నారు. అనేక అపోహలు, భయాలతో తల్లులు పిల్లలకి పాలు ఇవ్వరని, తల్లిపాల గురించి సరైన విజ్ఞానం అవసరం అన్నారు. కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ మారు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">