మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుంచి అర్హత సాధించిన కుప్పం యువతికి సీఎం అభినందన

channel18
0

మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుంచి అర్హత సాధించిన కుప్పం యువతికి సీఎం అభినందన




*అమరావతి :-* మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుండి అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, ఎం.కె.పురంనకు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుండి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుండి చందనా పాల్గొనున్నారు. కుప్పం నుంచి చందనా జయరాం మిస్ యూనివర్స్-ఇండియా పోటీలకు అర్హత సాధించడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">