ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

channel18
0

 ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి


జోనల్ కమిషనర్ రమ్య కీర్తన 

 ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జోనల్ కమిషనర్ రమ్య కీర్తన  పిలుపునిచ్చారు.

మంగళవారం పశ్చిమ లోని ఎన్డీయే కార్యాలయం నుంచి స్వాతి థియేటర్ వరకు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం పై అవగాహన ర్యాలిని నిర్వహించారు.

ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన సి ఓ లు, ఆర్పీలు, సచివాలయాల , మరియు శానిటేషన్ సిబ్బంది, స్థానిక ప్రజలందరూ కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ పునారు.

జోనల్ కమిషనర్ రమ్య కీర్తన మాట్లాడుతూ నానాటికి పెరిగిపోతున్న విద్యుత్ బిల్లులతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లి యోజన పథకాన్ని తీసుకొచ్చిందన్నారు.

ఇంటి  పైకప్పుపై రాయితీతో కూడిన సోలార్ ప్యానళ్ళను ఏర్పాటు చేసుకోవడం ద్వారా  ఉచిత విద్యుత్తును  పొందవచ్చు అన్నారు.

ఈ పథకంతో విద్యుత్ బిల్లును అదా చేయడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు  గృహ వినియోగదారులందరూ సబ్సిడీతో కూడిన ఈ సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని  అందించాలన్నారు.  

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని కనెక్షన్ కొరకు సూర్య ఘర్ వెబ్ సైట్ లో సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. 

ఈ పథకం గురించి సందేహాలు ఉంటే సమీప సచివాలయం లేదా విద్యుత్  కార్యాలయంలో  సంప్రదించాలని కోరారు.

ఈ అవగాహన సదస్సులో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రబోస్, ఎలక్ట్రికల్ ఏఈ ప్రసాద్, శానిటేషన్ సూపర్ వైజర్ శివరామ ప్రసాద్, కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు , గుడివాడ నరేంద్ర రాఘవ, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, కూటమి నేతలు దాడి అప్పారావు, రెడ్డిపల్లి రాజు,ఆవ్వారు బుల్లబ్బాయి, పగడాల కృష్ణ, పైలా సురేష్, కందుల సుబ్రహ్మణ్యేశ్వర రావు, దాడి మురళి, రౌతు రమ్య ప్రియ,బొల్లెపల్లి కోటేశ్వరరావు, వేంపలి గౌరీ శంకర్, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">