కేదారేశ్వరపేట రైతు బజార్ అభివృద్ధికి చర్యలు

channel18
0

 కేదారేశ్వరపేట రైతు బజార్ అభివృద్ధికి చర్యలు 



ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కేదారేశ్వరపేట రైతు బజార్ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. 

నియోజకవర్గ పర్యటనలో భాగంగా 34వ డివిజన్ రైతు బజార్ ను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్డీయే కూటమి నేతలతో కలిసి మంగళవారం సందర్శించారు. 

దుకాణదారులకు, వినియోగదారులకు ఉపయోగపడేలా రైతు బజార్ ను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అగ్రికల్చర్ మార్కెటింగ్ డి ఈ శేషగిరిరావు, ఎస్టేట్ ఆఫీసర్ కరుణాకర్ లతో కలిసి రైతు బజార్ సమస్యలపై చర్చించారు. కాలువ గట్టున కాంపౌండ్ వాల్ నిర్మించి అభివృద్ధి చేస్తే కొత్తగా దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చని డి ఈ కోరారు. 

అలాగే త్రాగునీటి సౌకర్యం కోసం అర్ ఓ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నూతనంగా ఫుట్ పాత్ లను ఏర్పాటు చేయడం నేరాల కట్టడి కోసం సీసీ కెమెరాల ఏర్పాటు రైతు బజార్ ను బ్యూటిఫికేషన్ చేయడం వంటి తదితర అంశాలపై చర్చించారు. 

రైతు బజార్ అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కట్టుబడి ఉన్నారని త్వరితగతిన అంచనా వ్యయాన్ని రూపొందించాలని ప్రత్తిపాటి శ్రీధర్ సంబంధిత అధికారులను కోరారు.

పర్యటనలో ఎన్డీయే కూటమి నేతలు రుద్రపాటి వెంకటేష్, ఆకుల శంకర్, అడ్డూరి కొండ, వేంపలి గౌరీ శంకర్, రౌతు రమ్యప్రియ, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">