డిటిసి కార్యాలయం, విజయవాడ. తేదీ 30.01.2025
కంటి చూపు మందగిస్తే ప్రమాదాలు జరుగుతాయి
డ్రైవర్లు ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించాలి*- డీటీసీ ఎ మోహన్
వయస్సు పైబడే కొద్ది కంటి చూపు మందగిస్తుందని, వాహనాలు నడిపేటప్పుడు ఎదుగుగా వస్తున్న వాటిని గమనించలేక రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, దృష్టి లోపాలు కలిగిన డ్రైవరులు ప్రతి ఆరు నెలలకోకసారి కంటి పరీక్షలను చేయించుకోవాలని డిటిసి ఎ మోహన్ అన్నారు.
స్థానిక బందరు రోడ్డులోని డీటీసీ కార్యాలయంలో గురువారం నాడు రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాన్ని డిటిసి ఎ మోహన్ ప్రారంభించారు. కంటి పరీక్షలు బీపీ షుగర్ సాధారణ పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డిటిసి ఎ మోహన్ మాట్లాడుతూ డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటేనే ప్రయాణికులు సురక్షితంగా ఇంటికి చేరుతారని, ఆరోగ్యం పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం వహించవద్దని డ్రైవర్లను ఆయన కోరారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు వాహనాలు నడపొద్దని ఆయన అన్నారు. కంటి చూపు మందగించిన డ్రైవర్లు కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారని, దృష్టి. లోపాలలు ఉండటం వలన దూరంనుండి వచ్చే వాహనాల రాకపోకలను గమనించలేకపోతారని, అలాంటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని డీటీసీ అన్నారు. దృష్టి లోపం ఉన్న డ్రైవర్లు కంటి పరీక్షలను చేయించుకొంటు అవసరమైన మందులను వాడటం, కంటి అద్దాలను పెట్టుకోవడం చేయాలన్నారు. అధిక స్పీడ్ తో వెళ్ళడం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తాయని అన్నారు. డిటిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి 300 మందికి పైబడి డ్రైవర్లు హాజరయ్యారని,డీటీసీ తెలిపారు. ఉచిత వైద్య శిబిరానికి డ్రైవర్ల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. వరుణ్ హెల్త్ సెంటర్ వైద్య నిపుణులైన డాక్టర్ల బృందంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. డాక్టర్ల బృందానికి డిటిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఆర్ ప్రవీణ్, కె వెంకటేశ్వరరావు, మోటార్ వాహన తనిఖీ అధికారులు పి వి రమణ, వై నాగేశ్వరరావు మహమ్మద్ అలీ, ఏవో అబ్దుల్ సత్తార్,సత్యనారాయణ, ఏపీ రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు, రోడ్ సేఫ్టీ ఎస్ఐ త్రిమూర్తులు, డాక్టర్ తేజ, వరుణ్ హెల్త్ సెంటర్ వైద్య బృందం మరియు డ్రైవర్లు పాల్గొన్నారు