పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం విలేఖరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...
నాలుగున్నర గంటల పాటు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు పొలిట్ బ్యూరో సమావేశంలో రాష్ట్ర పురోగతిపై చర్చించడం జరిగింది.చంద్రబాబు అధ్యక్షతన బులెట్ బ్యూరో సమావేశంలో అనేక అంశాలు చర్చించడం జరిగింది. అనేక పథకాలు, ససమస్యలపై చర్చ సాగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అచంచలమైన విశ్వాసంతో, నమ్మకంతో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారు. వారికి ధన్యవాదాలు. ప్రజలు రాష్ట్రానికి మేలు చేస్తారనే నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని ఎంపిక చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడు మాసాలు పూర్తయింది. గత ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసాలు సరి చేసుకుంటూ పోతున్నాం. ఏడు మాసాలలో ఎవరు ఊహించని కార్యక్రమాలు చేపట్టాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డుల్లో పోలీస్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ కు పద్మ భూషణ్ వచ్చింది. దీంతోపాటు మరికొంతమంది తెలుగు వారందరికీ చాలా మందికి అవార్డులు వచ్చాయి. వారందరికీ అభినందనలు. జాతీయ అధ్యక్షులు వారు గంటన్నర సేపు టీడీపీ మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని కులం కుశంగా చదివి చర్చించారు. రాష్ట్రంలో ఇంతవరకు చేసిన అభివృద్ధి గురించి చర్చించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. కాగా చంద్రబాబు అధికారం చేపట్టగానే రూ.3000 ఉన్న పెన్షన్ ని రూ. 4000కు పెంచారు. వికలాంగులకు రూ. 6 వేలు ఇస్తున్నాం. శాశ్వత రోగులకు రూ. 15 వేలు ఇస్తున్నాం. 1వ తేదినే తెల్లవారగానే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నాం. దేశంలో ఎక్కడా కూడా లేనివిధంగా పెన్షన్ ఇస్తున్నాం. సంవత్సరానికి రూ.32 వేల కోట్లు పెన్షన్ రూపేణ ఇస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశాం. అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడమేకాక, ఇంకా అధికంగా అన్నా క్యాంటిన్లను ప్రారంభించాం. భవిష్యత్తులో ప్రతి ఊరిలో ఒక అన్న క్యాంటిన్లను పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఎన్నికలకు ముందు టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నాం. ఈ సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఏడాదికి మూడు సిలండర్లు ఉచితంగా అందిస్తున్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయానికి పుంఖాను పుంఖానులుగా వినతులు రావడంతో ఇబ్బందికరంగా ఉంది. ధీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి శనివారం ఆయా నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ ను పెట్టదలచుకున్నాం. స్థానికులు వారి వారి ఎమ్మెల్యేల ద్వారా తమ సమస్యలను విన్నవించుకొని పరిష్కరించుటకు ప్రయత్నిస్తాం. పార్టీకి వెన్నుముక అయిన బలహీనవర్గాలను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది.గతంలో వారికి ఉన్న స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లను గత ప్రభుత్వం తగ్గించేసింది. మళ్లీ లీగల్ గా ఫైట్ చేసి కేంద్రంతో మాట్లాడి మళ్లీ బీసీ రిజర్వేషన్లను పెంచుతాం. అవసరం అయితే కోర్టుకు వెళ్లయినా సాధిస్తాం. మళ్లీ చిత్తశుద్ధితో, అంకిత భావంతో పాత రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుంది. అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరలిపోకుండా కాపాడి ఆ స్టీల్ ప్లాంట్ కు నిధులు ఇచ్చి ఆదుకుంది. ఈ ప్లాంట్ కాపాడినందుకు ఉత్తరాంధ్ర ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందించాల్సివుంది. అందరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎవరు సాధించలేని దాన్ని చంద్రబాబు నాయుడు సాధించారు. ఉత్తరాంధ్రకి మరిన్ని పరిశ్రమలు రానున్నాయి. ఆంధ్రుల హక్కు ఆయిన స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకుంటున్నందుకు అందరికి సంతోషంగా ఉంది. త్వరలో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. 5000 కోట్లతో రోడ్లు వేస్తున్నాం. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను వైసిపి ప్రభుత్వం వచ్చి నాశనం చేసింది. కేంద్రం నుండి రావాల్సిన నిధులను రాబట్టుకోలేకపోయింది. ఐదు సంవత్సరాలలో ఒక్క పైసా తేలేదు. అరకొరగా వచ్చిన నిధులను డైవర్ట్ చేసింది. కూటమి ప్రభుత్వం మళ్లీ స్ట్రీమిలైజ్ చేస్తోంది. కేంద్రం నుండి వచ్చేవి ఒకటి కూడా మిస్ చేయకుండా అన్ని విధాలా ఈ రాష్ట్రానికి మంచి జరగడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రఅభివృద్ధి జరిగే పథకాలను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శాసనసభ్యులతో నేరుగా మాట్లాడితే ఇంకా రియాల్టీ వస్తుందని చంద్రబాబు ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని నూతన పథకాలతో ముందుగా తీసుకెళ్తున్నాం. ఏదేమైనా పొలిట్ బ్యూరో సమావేశం ఒక మంచి సార్ధకత చేకూరే సమావేశం. ఈ సమావేశానికి ఊహించిన విధంగా మంచి రిజల్ట్ వచ్చింది. చంద్రబాబు సుదీర్ఘంగా మేనిఫెస్టో చదివారు. అందులో అనేక శాతం హామీలు పూర్తి చేశాం. సూపర్ సిక్స్ హామీలు తప్పక నెరవేరుస్తాం. మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చే ప్రణాళికలు తయారౌతున్నాయి. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ప్రారంభించనున్నాం. మిగతావి కూడా అంచలంచలుగా నెరవేరుస్తాం. వైసీపీ ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మద్దతుదారులకు చాలా ఇబ్బంది పెట్టింది. వారిపై అనేక కేసులు బనాయించి జైళ్లపాలు చేసింది. తప్పు చేసిన అధికారులకు శిక్షలుంటాయి. అనవసరంగా పెట్టిన కేసులు మాఫీ అయ్యేలా కృషి చేద్దాం. గత టీడీపీ హయాంలో రైతులకు ఇచ్చే డ్రిప్, ఇరిగేషన్ స్ప్రింకర్లు, వ్యవసాయానికి పనికొచ్చే పనిముట్లు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి వెళ్లే పడవలు ఇవ్వలేదు. కోత కొడవళ్లు సైతం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలన్నింటిని అమలుపరుస్తుంది. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపించుకుంటుంది. ఇంకా ప్రజలు ఆశించే విధంగా, ప్రజలు కోరుకునే విధంగా ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తాం. మొత్తానికి పొలిట్ బ్యూరో సమావేశంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
*టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ...*
పొలిట్ బ్యూరో సమావేశంలో సుమారు నాలుగున్నర గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మేనిఫెస్టో చదవడం, చదివించడం జరిగింది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చ జరిగింది. మేనిఫెస్టో అమలు మీద కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. టీడీపీ సభ్యత్వాలు విజయవంతంగా జరిగాయి. ఊహించని విధంగా మెంబర్షిప్ లు జరిగాయి. టీడీపీపై ప్రజలకు ఉన్న నమ్మకంతోటే ఎన్నికల్లో గెలగలిగాం. ఏపీలో సుమారు రాష్ట్రంతోపాటు అలాగే తెలంగాణలో, అండమాన్ లో మొత్తంగా మూడు ప్రాంతాల్లో కోటి రెండు లక్షల 17 మెంబర్షిప్లు పూర్తి చేసుకున్నాం. ఫస్ట్ టైం కోటి మెంబర్షిప్లు చేసుకోవడం జరిగింది. దీంతో మేము ఒక స్ట్రక్చర్ వేసుకున్నాం. దాని ప్రకారం ముందుకెళతాం. క్లష్టర్, యూనిట్ బూత్ ఇలా విభజించుకుంటూ పోతాం. దీంతో కింది స్థాయి నుంచి పార్టీ బలపడడానికి అవకాశం ఉంది. ప్రతి ఇంటికొక తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఉండేలా చూడాలని నిర్ణయించుకున్నాం. కుటుంబ సాధికారత సాధించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది.