కూరగాయల వాహనాలకు అనుమతి ఇవ్వండి సుజనా చౌదరికి హోల్ సేల్ కూరగాయల వ్యాపారుల వినతి

channel18
0

 కూరగాయల వాహనాలకు అనుమతి ఇవ్వండి

సుజనా చౌదరికి హోల్ సేల్ కూరగాయల వ్యాపారుల వినతి


..


రాజీవ్ గాంధీ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో వ్యాపార కార్యకలాపాల నిమిత్తం రైల్వే స్థలంలో ప్రతిబంధకాలు తొలగించాలని వ్యాపారులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ లో వాహనాల రాకపోకలకు వీలు లేకుండా రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన గడ్డర్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని రాజీవ్ గాంధీ హోల్ సేల్ వెజిటబుల్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు ఈ మేరకు ఎమ్మెల్యే సుజనా చౌదరికి వినతి పత్రం అందజేశారు. 

ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ గురువారం రాజీవ్ గాంధీ హోల్ సేల్ వెజిటేబుల్ మార్కెట్ ను సందర్శించారు. 

దుకాణదారులు తమ సమస్యలను తెలియజేశారు.

సుమారు మూడు దశాబ్దాల నుండి రాజీవ్ గాంధీ మార్కెట్లో వ్యాపారాలను నిర్వహిస్తున్నామని సంవత్సరం క్రితం రైల్వే స్థలంలో ఉన్న మార్కెట్ ను ఖాళీ చేయాలని రైల్వే అధికారులు ఆదేశించారన్నారు. ఇందుకు 

ప్రత్యామ్నాయంగా వ్యాపారస్తులందరం నగర శివారులోని నున్న ప్రాంతంలో ఆరు ఎకరాల స్థలం కొనుగోలు చేసి

మార్కెట్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. నిర్మాణం పూర్తయ్యేంతవరకు రాజీవ్ గాంధీ పార్క్ వైపు నుంచి కాయగూరల మార్కెట్లోకి వాహనాల రాకపోకలకు వీలు కల్పించాలని వారు కోరారు.. రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి రహదారిలో ఏర్పాటుచేసిన స్లీపర్లు, నెట్లను తొలగింప చేయవలసిందిగా ప్రత్తిపాటి శ్రీధర్ కు వ్యాపారులు విజ్ఞప్తి చేశారు. పలుమార్లు విఎంసి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు..

సమస్యను ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ప్రత్తిపాటి శ్రీధర్ వ్యాపారులకు భరోసా ఇచ్చారు .

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">