విజయవాడ నగర పాలక సంస్థ
31-01-2025
ఎస్ సి సబ్ క్లాసిఫికేషన్ పై, వన్ మాన్ కమిషన్ చైర్మన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ఎస్సీ సబ్ క్లాస్సిఫికేషన్ రిజర్వేషన్ విధానాల ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేయడానికి ప్రత్యేకమైన సిఫార్సులను సూచించేందుకు ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా, ఐఏఎస్. (రిటైర్డ్) ని వన్ మాన్ కమిషన్‌గా నియమించింది.
ఈ కమిషన్ అనేక అంశాలను పరిశీలించి, రాష్ట్రంలోని పలు ఉప వర్గాల సంక్షేమాన్ని పరిరక్షించేలా స్పష్టమైన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించనుంది. అందులో భాగంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్రతో కలిసి రెల్లిస్ కాలనీ ప్రజలను, అంగన్వాడి, హై స్కూల్, స్వయం సహాయక బృందాల జీవనోపాధిని పరిశీలించారు.
వన్ మాన్ కమిషన్ గా వచ్చిన రాజీవ్ రంజన్ మిశ్రా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్రతో కలిసి రెల్లిస్ కాలనీలో ఎస్ సి ప్రజలు నివసిస్తున్న ఇళ్లను, చేస్తున్న వృత్తులు అడిగి తెలుసుకున్నారు. తదుపరి అంగన్వాడి స్కూల్ పిల్లలు వాళ్లకు అందిస్తున్న పోషకాహారాలు, వారి ఎత్తు బరువు, అంగన్వాడీలో కల్పించిన వసతులు పరిశీలించారు.
తదుపరి స్వయం సహాయక బృందమైన సాయినాథ గ్రూప్ వారు తయారు చేసిన ఉత్పత్తులను వాటి ద్వారా వారికి కలుగుతున్న ఆర్థిక అభివృద్ధి, ప్రభుత్వం వారికి కనిపిస్తున్న రుణ సదుపాయం వంటి విషయాలను పరిశీలించారు. తదుపరి పటమట లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ప్రధాన ఉపాధ్యాయురాలు తో మాట్లాడి చదువుతున్న ఎస్ సి పిల్లల జనాభా, వారి పురోగతి వారికి కల్పిస్తున్న భోజన వసతులు అడిగి తెలుసుకున్నారు. 9వ తరగతి పిల్లలతో వారు చదువుతున్న పాఠ్యాంశాన్ని చెప్పమని వారి సామర్థ్యాన్ని పరిశీలించారు.
ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ ప్రభుదాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపీనాయక్, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.