భవిష్యత్ బిజినెస్ లీడర్లను తయారు చేయడమే సీడాప్ లక్ష్యం

channel18
0

 


విజయవాడ, తేదీ: 30.01.2025


భవిష్యత్ బిజినెస్ లీడర్లను తయారు చేయడమే సీడాప్ లక్ష్యం

యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 24 సెక్టార్స్ లో ఐఎస్బీతో ఒప్పందం

ప్రజల సౌకర్యం కోసం మన మిత్ర అనే యాప్

యువతకు ఉపాధి కల్పనలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి

గుణపాటి దీపక్ రెడ్డి, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన వ్యవస్థాపన అభివృద్ది సంస్థ

రాష్ట్రం నుంచి భవిష్యత్తు బిజినెస్ లీడర్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీడాప్ పనిచేస్తుందని అందుకు ఐఎస్బీ తో ఒప్పందం కూడా చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన వ్యవస్థాపన అభివృద్ది సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి తెలిపారు.. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల సీడాప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) తో కొన్ని కోర్సులకు ఎంవోయూ చేసుకోవడంలో ముఖ్యమైన ఉద్దేశ్యం వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ ప్రెన్యూర్ నినాదమే అని అన్నారు. అదేవిధంగా సెంచూరియన్ యూనివర్శిటీతో ఒప్పందం చేసుకున్నామని, దీనివల్ల 40 శాతం ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో రానున్న మూడు సంవత్సరాల్లో 22 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. సీడాప్ ఒక నోడల్ ఏజెన్సీగా ఉండేలా, ముఖ్యమంత్రి డైరెక్షన్స్ లో పనిచేస్తుందన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ద్వారా క్షేత్ర స్ధాయిలో యువతకు అవకాశాలు కల్పిస్తామన్నారు. మంత్రి లోకేష్ మార్గనిర్ధేశంలో మేం డైనమిక్ గా పని చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు 6 ఇండస్ట్రియల్ పాలసీలు ఈ ఆరు నెలల్లోనే ప్రకటించామన్నారు. ప్రజల సౌకర్యం కోసం మన మిత్ర అనే యాప్ ద్వారా 166 సర్వీసులు అందుబాటులో ఉండేలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చమని, దీన్ని 520 సర్వీసులకు తీసుకెళ్లతామన్నారు. 

స్వర్ణాంధ్ర 2047 విడుదల చేయడం ద్వారా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను 347 లక్షల కోట్లకు పెంచేందుకు, తలసరి ఆదాయాన్ని 58 లక్షలకు పెంచేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దేలా పని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారని, 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారని అందులో సీడాప్ కూడా భాగస్వామి అయ్యిందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ళూ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు. ఏపీ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 17 వ స్థానానికి దిగజారిందని, చివరన పంజాబ్ రాష్ట్రం మాత్రమే ఉండగా, ఆ రాష్ట్రం పైన మన రాష్ట్రం ఉండటం దురధృష్టకరమన్నారు. 

ఐఎస్బీ ప్రతినిధి డాక్టర్. చందన్ చౌదరి మాట్లాడుతూ మాన్యుఫాక్షరింగ్ రంగంలో లీడర్స్ ను తయారు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఉద్యోగ సృష్టి మరియు ఎగుమతిని పెంచడానికి మనం తయారీ రంగం వృద్ధిని పెంచాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారీ రంగంలో వేగవంతమైన వృద్ధిని ప్రదర్శించడం మరియు ఉద్యోగాలను సృష్టించడం ద్వారా దేశంలో ఏపీ సరికొత్త విధానంతో ముందుకెళ్లుతోందన్నారు.

పాత్రికేయుల సమావేశంలో సెంచూరియన్ యూనివర్శిటీ ప్రతినిధి జేఎం రావు, ఐఎస్బీ ప్రతినిధి డాక్టర్ యుగల్ నౌహ్రియా, సీడాప్ సీఈవో పి. నారాయణ స్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే. శ్యాం ప్రసాద్ లు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">