వైయస్ ఆర్ సిపి ఫీజ్ పోరు కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు

channel18
0

 విజయవాడ

30-01-2025


వైయస్ ఆర్ సిపి ఫీజ్ పోరు కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు



విద్యార్థుల పక్షాన అండగా నిలుస్తూ చంద్ర బాబు సర్కార్ పై నిరసన గళం విప్పే విధంగా ఫిబ్రవరి 5వ తేదీన వైయస్ ఆర్ సిపి ఫీజ్ పోరు పేరుతొ అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు విద్యార్థులు, విద్యార్థుల తల్లి దండ్రులతో కలిసి కలెక్టర్లకు డిమాండ్ లతో వినతి పత్రం అందజేయనున్నారు ఈ పోరు సంబందించిన పోస్టర్ ను తాడేపల్లి లోని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నాడు వైసిపి నేతలు మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల తిప్పి రెడ్డి, కాకుమాను రాజశేఖర్, విద్యార్ది విభాగం నాయకులూ పానుగంటి చైతన్య, రవి చంద్ర ఆవిష్కరించారు

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి ఆటంకం కలగకుండా వారి చదువులు పూర్తి చేయడానికి నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫీజ్ రియంబర్స్మెంట్, ఉచిత విద్య వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసారన్నారు తరువాత జగన్ మోహన్ రెడ్డి విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, అమ్మఒడి, గోరు ముద్ద వంటి పధకాలను ప్రవేశ పెట్టి అమలు చేసారన్నారు. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న ఫీజ్ రియంబర్స్మెంట్ పధకం కింద విద్యార్థుల చదువుల కోసం చెల్లించవలసిన ఫీజ్ ని ఇప్పటి వరకు చెల్లించకుండా పెద్ద చదువులు, ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులను ఇబ్బంది పడే విధంగా, వారి యొక్క భవిష్యత్తు రోడ్ మీద పడే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమన్నారు. నాడు పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి కేజీ నుంచి పిజి వరకు ఉచిత విద్యను అందిస్తానని హామీ ఇచ్చారన్నారు. దరిమిలా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరవాత 5 సంవత్సరాల పాలనలో విద్య వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, ప్రతి ఒక్కరు ఇంగ్లిష్ మీడియం లో చదవాలని, రాష్ట్రంలోని పిల్లలందరూ ఉన్నత చదువులు చదవాలని, మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్ట్ ఎంతో దృఢ సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలను నాడు - నేడు పేరుతొ ప్రయివేటు పాఠశాలకు దీటుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు, చిన్న పిల్లలకు పౌష్ఠిక ఆహారం అందిస్తే చదువులో బాగా రాణిస్తారని నమ్మకంతో మేనిఫెస్టో లో లేనప్పటికీ జగనన్న గోరు ముద్ద పధకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగిందన్నారు. జగన్ హయంలో స్కూల్ బాగ్ లు, డ్రెస్ లు, షూస్, పుస్తకాలు విద్యార్థులకు అందించడం లో పెను మార్పును తీసుకువచ్చారన్నారు. డిప్యూటీ సియం హోదాలో పవన్ కళ్యాణ్ ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ప్రభుత్వ పాఠశాల లేదా ప్రయివేటు పాఠశాల అన్ని ఆశ్చర్యపోయారని జగన్ మోహన్ రెడ్డి పరిపాలన విధానంలో మార్పు అన్ని కొనియాడారు. అటువంటి విద్యార్థులను నేడు రోడ్డున పడేసేవిధంగా నేడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వాళ్ళ ఫీజ్ బకాయిలు చెల్లించకుండా వాళ్ళ చదువులు మధ్యలోనే ఆగిపోయే విధంగా నేడు కూటమి ప్రభుత్వం పరిపాల జరుగుతుందన్నారు. వెంటనే విద్యార్థుల ఫీజ్ లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 5వ తేదీన అన్ని జిల్లాల కలక్టరేట్ లలో వినతి పత్రం అందించడం జరుగుతుందని. విద్యార్థుల భవిష్యత్తు కాపాడమని, బకాయలు చెల్లించమని కోరడం జరుగుతుందన్నారు. కలక్టరేట్ ల వద్ద వినతి పత్రంతో ఈ ఉద్యమం ఆగదని వారి యొక్క ఫీజ్ లు చెల్లించే వరకు విద్యార్థులకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున తోడుగా ఉంటామని అన్నారు. ఫిబ్రవరి 5న ప్రతి జిల్లాల కలెక్టరేట్ల వద్ద జరిగే ఫీజ్ పోరు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం మెడలు వంచే విధంగా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులుతో కలిసి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">