దేశ భద్రతను కాపాడటంలో సైనికుల పాత్ర ఎనలేనిది
బిజెపి ఆర్గనైజేషన్ సెక్రెటరీ మధుకర్ జి
భారతీయ జనతా పార్టీ ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తపేట కేబీఎన్ కళాశాలలో ఆర్మీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ మధుకర్ జి, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, జి ఆర్ కె పోలవరపు సాంస్కృతిక సమితి ప్రెసిడెంట్ గోళ్ళ నారాయణరావు, ఏపీ బిజెపి ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ బాజీ, కేబీఎన్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కె నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మధుకర్ జీ మాట్లాడుతూ దేశ భద్రతను కాపాడటంలో భారత సైనికుల పాత్ర ఎనలేనిదని అన్నారు. భారతీయులందరం ప్రశాంత జీవనం గడుపుతూ సంతోషంగా ఉండటానికి భారత సైనికులే కీలకమన్నారు. 24 గంటలు సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తూ ఎండలని,వర్షాలని, మంచుని సైతం లెక్కచేయకుండా దేశ రక్షణలో ప్రాణ త్యాగానికి వెనకాడకుండా కోట్లాది భారతీయుల కోసం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న వారి త్యాగాలు వెలకట్టలేని అన్నారు.
విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరిని సైనికులుగా తయారు చేయాలని యువత దేశ రక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.
ప్రధాని మోడీ పాలనలోనే సవాళ్లను అధిగమించి భారత ఆర్మీ పటిష్టంగా తయారైందని మధుకర్ జి తెలిపారు.
మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కె నాగరాజు మాట్లాడుతూ 1948లో చివరి బ్రిటిషన్ కమాండర్ జనరల్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో భారతదేశ మొట్టమొదటి సైనిక కమాండర్ గా కె యం కరియప్ప జనవరి 15 న బాధ్యతలు స్వీకరించారని అప్పటినుంచి ప్రతి సంవత్సరం జాతీయ సైనిక దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు. దేశ రక్షణలో భాగంగా విధులు నిర్వర్తించే జవాన్లకు ప్రభుత్వం పదవీ విరమణ అనంతరం అందజేసే ప్రయోజనాలను మరింత సులభతరం చేసి ఇల్లు,ఇళ్ల స్థలాలను కార్డు వాల్యూ ధరకే అందించాలని ,డి జి ఆర్ స్కేల్ వంటి తదితర అంశాలను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో సుమారు 60 వేల మంది మాజీ సైనికులం ఉన్నామని మమ్మల్ని ప్రోత్సహిస్తే అందరం సంఘటితమై మాజీ సైనికుల కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా వివిధ పథకాలు పొందిన సైనికులను, పదవి విరమణ పొందిన సైనికులను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఈ ఆర్మీ డే వేడుకలలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ కన్వీనర్ కె కె నరసింహారావు, టిడిపి గల్ఫ్ కంట్రీస్ కోఆర్డినేటర్ వెంకట అప్పారావు,బిజెపి నేతలు మువ్వల సుబ్బయ్య, బి ఎస్ కె పట్నాయక్, అవ్వారు బుల్లబ్బాయి, యం సత్య సాయి, పైలా సురేష్, వై అనిల్ దేవిన ప్రసాద్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.