పార్లమెంట్ లో స్వర్ణకార గోల్డ్ అప్రైజర్స్ ఉద్యోగ భద్రతపై చర్చించాలి. ఢిల్లీ వ్యవహారాల ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్

channel18
1 minute read
0

 పార్లమెంట్ లో స్వర్ణకార గోల్డ్ అప్రైజర్స్ ఉద్యోగ భద్రతపై చర్చించాలి

 జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ వ్యవహారాల ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్


 జనవరి 31 జాతీయ బిసి సంక్షేమ సంఘ కార్యాలయం విజయవాడ

 ఢిల్లీలో పార్లమెంట్ నేటి నుంచి ప్రారంభమైన సందర్భంలో 16 బిల్లులతో ఈ పార్లమెంట్ సెక్షన్ జరుగుతున్న వేళ ముఖ్యమైనటువంటి ఆర్థిక బ్యాంకింగ్ రెగ్యులేషన్ పై బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మల సీతారామన్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి దేశంలో వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న స్వర్ణకార గోల్డ్ అప్రైజర్స్ ఉద్యోగ భద్రతపై సభకు తెలియజేయాల్సిన బాధ్యత దేశంలో ప్రతి స్వర్ణకార నాయకుడు చేపట్ట వలసిందిగా స్థానిక పార్లమెంటు సభ్యుల ద్వారా రాజ్యసభ సభ్యుల ద్వారా ఈ బిల్లు చర్చికి వచ్చే సందర్భంలో మాట్లాడే విధంగా పార్లమెంటు సభ్యుల్ని విజ్ఞప్తి చేయవలసిందిగా కోరారు బ్యాంకుల్లో ఎటువంటి భద్రత లేకుండా కరోనా సమయంలో వేలాదిమంది దేశంలో బ్యాంక్ గోల్డ్ అప్రైజర్లకి కరోనా బారిన పడ్డారని చనిపోయిన వారికి ఏ బ్యాంకు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోగా ఉద్యోగ భద్రత కూడా లేకుండా చట్టాలు ఉండడం అన్యాయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ వ్యవహారాల ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఇప్పుడు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రులకి పార్లమెంటు సభ్యుల్ని పలువురు స్వర్ణకార అప్రైజర్ నాయకులతో కలిసి ఢిల్లీలో కలుస్తున్నట్టుగా వేణుమాధవ్ తెలియజేశారు స్వర్ణకార గోల్డ్ అప్రైజర్లకు ఉద్యోగ భద్రత కల్పించి కరోనా సమయంలో చనిపోయిన అప్రైజర్ల కుటుంబాలకి ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు*

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">