గన్నవరం నియోజకవర్గంలో కన్నుల పండుగగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
*బీసీ, ఎస్సి, ఎస్టీ లకు రాజ్యాధికారం కల్పించిన నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్*
*స్వతంత్ర భారత చరిత్రలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఏకైక రాజకీయ నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు*
*గన్నవరం నియోజకవర్గంలోని 99 మంది పేదలకు సీ.ఎం రిలీఫ్ ఫండ్ చెక్కలు మంజూరు*
*టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో వెల్లడించిన ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు*
తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ముందుగా ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రతిమకు పుష్పాంజలి ఘటించి, భారీ కేకును కట్ చేసి ఆవిర్భావ సభను ప్రారంభించారు.
ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా 1982 వ సంవత్సరం మార్చి 29వ తేదీన హైదరాబాదులోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారని, అనతి కాలంలోనే దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఎదిగిందని ఆ తరువాత ఇందిరా గాంధీ గారు చనిపోయిన నేపథ్యంలో దేశంలో సానుభూతి ఏర్పడి రాజీవ్ గాంధీ గారికి 400 పైగా పార్లమెంటు స్థానాలు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు టిడిపికే పట్టం కట్టి రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించి ఆనాటి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం పార్టీని నిలిపారని అన్నారు.
నందమూరి తారక రామారావు తెలుగుదేశం పేరుతో పార్టీని ప్రారంభించి రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రకటించిన వెంటనే అప్పటి అధికార పార్టీకి చెందిన నాయకులు రూ 1.90 పైసలకి ఆ పథకాన్ని అమలు చేసినప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్టీఆర్ నే నమ్మారని అన్నారు. 1984 ఆగస్టు సంక్షోభంలో పదవిని కోల్పోయిన ఎన్టీఆర్ తిరిగి నెలరోజులకే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారని తెలిపారు.
ఎన్టీఆర్ పాలనలో రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తిహక్కు, కరణాలు, మునసబు, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం వంటి సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లను తొలిగా ప్రారంభించింది టీడీపీయేనని, ఎన్టీఆర్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20 శాతం, మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనతా టీడీపీ సొంతమని అన్నారు.
గన్నవరం నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న 99 మంది పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేయడం సంతోషకరమని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలుపుతూ 99 మంది కి సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను అందజేశారు. నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి ప్రయోజనాల కోసమే పని చేస్తుందని తెలిపారు.
కార్యక్రమం అనంతరం గన్నవరం లోని నాలుగు రోడ్ల కూడలిలో గల ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి ర్యాలీగా వెళ్లి NTR గారి విగ్రహానికి పాలాభిషకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని టిడిపి నాయకులు తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వారి గ్రామాల్లో నిర్వహించి యార్లగడ్డ వెంకట్రావు పిలుపుమేరకు పెద్ద ఎత్తున గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు మరియు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు చిరుమామిళ్ల సూర్యం, బచ్చుల సుబ్రహ్మణ్యం (బోసు), రాష్ట్ర టిడిపి కార్యదర్శి దొంతు చిన్న, బాపులపాడు మండల టిడిపి అధ్యక్షుడు దయ్యాల రాజేశ్వరరావు, ఉంగుటూరు మండల టిడిపి అధ్యక్షుడు ఆరుమళ్ళ వెంకటకృష్ణారెడ్డి, విజయవాడ రూరల్ మండలం టిడిపి అధ్యక్షుడు గొడ్డళ్ళ చిన్న రామారావు, రాష్ట్ర టిడిపి వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి గూడవల్లి నరసింహారావు (నరసయ్య), క్లస్టర్ ఇంచార్జిలు గుజ్జర్లపూడి బాబురావు, బొప్పన హరికృష్ణ, తంగిరాల శ్రీనివాసరావు, పుట్టా సురేష్, గన్నవరం మండల టిడిపి ప్రధాన కార్యదర్శి బోడపాటి రవికుమార్, విజయవాడ రూరల్ మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి కోనేరు సందీప్, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణ రావు, రాష్ట్ర రైతు విభాగం నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు, తెలుగు మహిళా నేతలు పొదిలి లలిత, మేడేపల్లి రమ, నెక్కంటి శ్రీదేవి, వడ్డీల్లి లక్ష్మి, బుస్సే సరిత, కంభంపాటి లక్ష్మి, దేవినేని సులోచన, దాసరి శ్వేత, బేతాళ ప్రమీల రాణి, గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పరుచూరి నరేష్, ప్రజా ప్రతినిధులు పడమటి రంగారావు, కాటూరి విజయభాస్కర్, గండికోట సీతయ్య మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత సభ్యులు, తెలుగు మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.