ఆత్మ విశ్వాసమే బలంగా విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని జిల్లా ప్రగతిని విశ్వ వినువీధు లకు చాటేలా అధికారులు చేయాలని..
పేదరిక నిర్మూలనకు ఈ ఉగాది నాంది కోరుతూ జిల్లా ప్రజలకు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు .
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదరిక నిర్మూలన కోసం అమలు చేస్తున్న పి-4 పథకం దిగ్విజయంగా కొనసాగేందుకు ఈ ఉగాది నాంది కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా జిల్లాలో రైతాంగం, వ్యాపార వర్గాలు, విద్య, వైద్య రంగాలు అభివృద్ధి పథంలో
పయనించాలన్నారు. జిల్లా ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో జిల్లాను రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిపేందుకు ఈ ఉగాది పునాది కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేసేలా
పునరంకితమయ్యేందుకు జిల్లా యంత్రాంగం నూతన శక్తితో బాధ్యతలు నిర్వహించాలని కోరుకుంటు ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఉద్యోగుల కు ప్రజలకు ఉగాది శుభాకాంక్షాలు తెలియజేశారు.