*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ కార్యాలయము, విజయవాడ.*
*తేదీ.01-04-2025.*
పొక్సో కేసులను ధర్యాప్తు చేయు విధానం పై అవగాహన
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనరేట్ పరిదిలోని పోలీసు సిబ్బంది అంధరూ పోలీసు విధులలో బాగంగా ప్రతి ఒక్క అంశంపై పూర్తి అవగాహన కలిగి నగర ప్రజలకు మెరుగైన సేవలను అంధించాలనే సదుద్దేశంతో నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో సిటీ ట్రైనింగ్ సెంటర్ ఏ.సి.పి. బి.ఉమా మహేశ్వర రెడ్డి వారి సిబ్బందితో కలిసి నగరంలోని పోలీసు అదికారులు మరియు సిబ్బందికి వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు ఎ. సి. పి. గార్లకు, ఎస్. హెచ్. ఓ. లకు పొక్సో కేసులలో ఇంపార్టెంట్ టు ఇన్వెస్టిగేషన్ ఎఫ్.ఐ.ఆర్. టు చార్జ్ షీట్ వరకు తీసుకోవాల్సిన చర్యల గురించి పొక్సో కోర్ట్ స్పెషల్ పి.పి. కృష్ణ వేణి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. నందిగామ మైలవరం తిరువూరు సబ్ డివిజన్లోని అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోక్సో కేసులపై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ శిక్షణలో నేర స్థలంలో ఆదునిక సాంకేతిక పరిజ్నానాన్ని ఉపయోగించుకుని ఏవిధంగా సాక్ష్యాలను సేకరించాలి, ధర్యాప్తు అనంతరం ఛార్జ్ షీట్ ఏ విధంగా వేయాలి అనే విషయాలపై క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దర్యాప్తు సమయంలో ఇన్వెస్టిగేషన్ అధికారులు చేయు పొరపాట్లపై క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అనంతరం అధికారులు అడిగిన అనుమానలను నివృత్తి చేయడం జరిగింది.
ఈ సంధర్భంగా అడ్మిన్ డి.సి.పి. మాట్లాడుతూ.గత ఐదు సంవత్సరాల నుండి వివిద కారణాల చేత సిబ్బందికి ఆర్.సి.కోర్స్ లను నిర్వహించలేకపోయాము. ఇప్పుడు పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ప్రత్యేక చొరవ తీసుకుని కమిషనరేట్ పరిదిలోని పోలీసు సిబ్బంది అంధరూ పోలీసు విధులలో బాగంగా ప్రతి ఒక్క అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఈ శిక్షణలను ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా పొక్సో కేసులు ఎంతో సున్నితమైనవి కాబట్టి ప్రతి ఒక్కరూ శిక్షణ ఇచ్చే ప్రతి అంశాన్ని పూర్తిగా తెలుసుకోవాలని ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే అధికారులను అడిగి తెలుసుకుని నివృత్తి చేసుకుని పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితులు/ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిసిపిలు కే.జీ.వి.సరిత ఐ. పి. ఎస్. ఏ బి టి ఎస్ ఉదయ రాణి ఐపీఎస్ కృష్ణమూర్తి నాయుడు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.
-