విజయవాడ.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల పై మంత్రి నారాయణ సమీక్ష
హాజరైన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే లు బోండా ఉమా,గద్దె రామమోహన్, బోడె ప్రసాద్,జిల్లా కలెక్టర్ లక్ష్మీషా,వీఎంసి కమిషనర్ ధ్యానచంద్ర,ఇతర ఉన్నతాధికారులు
వీఎంసీ పరిధిలో ఉన్న సమస్యలు,అభివృద్ధి ప్రణాళికపై సమావేశంలో ప్రధానంగా చర్చ
వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలువ లేకుండా ఉండేలా వరద నీటి కాలువల పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ
మెప్మా లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పనపై అధికారులకు దిశానిర్దేశం
ప్రజాప్రతినిధుల సూచనలతో నగరంలో పార్కులు,రోడ్లు,ఇతర వసతుల కల్పనపై పలు నిర్ణయాలు తీసుకున్న మంత్రి
నగరంలో నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు రోడ్ల కనెక్టివిటీ పెంచాలని ఆదేశాలు
త్వరలో మరో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభం అవుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఎన్ హెచ్ అధికారులకు మంత్రి ఆదేశాలు
ఎయిర్పోర్ట్ కారిడార్ రహదారిలో గ్రీనరీ కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించిన మంత్రి