ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర హ‌జ్ క‌మిటీ ఛైర్మ‌న్ షేక్ హ‌స‌న్

channel18
0

 17-04-2025

ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర హ‌జ్ క‌మిటీ ఛైర్మ‌న్ షేక్ హ‌స‌న్ 

విజయవాడ : రాష్ట్ర హ‌జ్ క‌మిటీ ఛైర్మ‌న్ గా నియ‌మితులైన షేక్ హ‌స‌న్ బాషా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను షేక్ హ‌స‌న్ బాషా కలుసుకున్నారు. రాష్ట్ర హ‌జ్ క‌మిటీ ఛైర్మ‌న్ గా నియ‌మితులైన షేక్ హ‌స‌న్ బాషాకి ఎంపి కేశినేని శివ‌నాథ్ అభినంద‌న‌లు తెలిపి పుష్ప‌గుచ్చం అందించి శాలువాతో స‌త్క‌రించారు. 

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర టీడీపీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ ఎస్.ఎమ్.ఫైజాన్, ఎన్టీఆర్ జిల్లా ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ మీర్జా ముజఫర్ బేగ్, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్య‌ద‌ర్శి షేక్ నూర్, స్వర్ణకార సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ షేక్ అమానుల్లా, ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఎమ్.డి. అఫ్స‌ర్ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Newer

    ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర హ‌జ్ క‌మిటీ ఛైర్మ‌న్ షేక్ హ‌స‌న్

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">