పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పడాల రూప దేవికి ఎమ్మెల్యే సుజనా చౌదరి చేయూత
అండగా ఉంటానని హామీ
పారా బ్యాడ్మింటన్ లో జాతియ, అంతర్జాతీయ స్థాయిలలో అనేక మెడల్స్ సాధించిన క్రీడాకారిణి పడాల రూప దేవికి ఎమ్మెల్యే సుజనా చౌదరి చేయూతనందిస్తున్నారు.
శ్రీకాకుళంకు చెందిన రూపదేవి దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినిడంతో కాళ్లలో కదలికలు కోల్పోయింది. అయినా ఆధైర్యం చెందక పట్టుదలతో విధిని ఎదిరించి పారా బ్యాడ్మింటన్ లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలను సాధినచింది.
ఇటీవల ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలిసిన రూప దేవి తాను సాధించిన విజయాలు, అందుకున్న మెడల్స్ ను చూపించి తనను మరింతగా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసింది. రూప దేవి కి అన్ని విధాలుగా అండగా నిలబడతానని సుజనా హామీ ఇచ్చారు.
సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ రంగులోకి దిగారు. రూప ఉన్నత విద్యను అభ్యసించాలని పారా బ్యాడ్మింటన్ లో మరిన్ని విజయాలు కైవసం చేసుకొని దేశానికి మరింత పేరు తేవాలని సుజనా ఫౌండేషన్ ద్వారా నెలకు రూ 25000 వేల చొప్పున ఏడాది పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో గురువారం రూపా దేవికి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజనా ఫౌండేషన్ సిబ్బందితో కలిసి రూ 25 వేల రూపాయల చెక్కును రూప దేవి కి అందించారు.
అడిగిన వెంటనే స్పందించి తనకు
అండగా నిలిచిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు , సుజనా ఫౌండేషన్ సిబ్బంది కు పడాల రూపదేవి కృతజ్ఞతలు తెలిపారు.