లోక్ సభలో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు నేడు రాజ్యసభకు బిల్లు
అనుకూల ఓట్లు 288.. వ్యతిరేకంగా 232 ఓట్లు..
14 గంటలకు పైగా సుదీర్ఘ సమావేశం..తెల్లవారుజాము 02.30 వరకూ చర్చ.
ఇటీవలి కాలంలో ఇంత సుదీర్ఘ సమయం పాటు లోక్సభ భేటీ కొనసాగడం ఇదే ప్రథమం.
బిల్లుకు ఎన్డీయే ప్రధాన భాగస్వామ్యపక్షాలైన తెదేపా, జేడీ(యు), శివసేన (శిందే), లోక్ జనశక్తి పార్టీ (రామ్విలాస్) మద్దతుగా నిలిచాయి.
విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాయి. వైకాపా కూడా బిల్లుకు ప్రతికూలంగానే స్పందించింది.