పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

channel18
0

 *ఎన్. టి. ఆర్ . జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.*

*తేది.01.04.2025.*


పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు



*సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, పదవి వీరమణ పొందడం అభినందనీయం.*

*ఇన్ని రోజులు చట్టాలకు అనుగుణంగా విధులు నిర్వహించారు, మనమంతా ఒకే పోలీసు కుటుంబం.*

*పోలీసు డిపార్ట్మెంట్ లో ప్రజా సేవకే మీ సమయం, శక్తి అన్ని వినియోగించినందుకు డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు. నగర పోలీసు కమిషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్*


ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ది, అంకిత భావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలందించి ది.31.03.2025 తేదిన పదవీ విరమణ చేసిన ఐదుగురు పోలీస్ అధికారులను పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు పోలీస్ కమిషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.,  అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి సరిత ఐ. పి. ఎస్.  మరియు పోలీస్ అధికారులతో కలిసి సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించినందుకు గాను పదవీ విరమణ చేసిన  అధికారులను అభినందించి పోలీస్ మర్యాదలతో శాలువాలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికినారు.


*పదవీవిరమణ పొందిన వారి వివరాలు :*

*క్ర.సం*          *పేరు*                    *హోదా* *విధులు నిర్వహణ*

(1)    ఎ.శ్రీనివాస రావు ఎ.డి‌.సి.పి. టాస్క్ ఫోర్స్ 

(2) అబ్దుల్ రఖీబ్ సబ్ఇన్స్పెక్టర్ గుణదల పోలీస్ స్టేషన్ 

(3) జె.రంగయ్య సబ్ఇన్స్పెక్టర్ మూడవ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్

(4) వై.ఎన్. మహంకాళి రావు అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ సి.ఎస్.బి.  

(5) ఎన్. శ్రీనివాస రావు ఎ.ఆర్.హెచ్.సి. సి.ఎ.ఆర్.

 

ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ. పి. ఎస్. ఎ. ఆర్. ఎ.సి.పి. డి. ప్రసాదరావు  వెల్ఫేర్ ఆర్.ఐ  శ్రీనివాసరావు  ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు  ఎం. సోమయ్య, అసోసియేషన్ సంఘ సభ్యులు మరియు అధికారులు, సి.పి.ఓ. సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">