ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామిని తాకిన సూర్య కిరణాలు

channel18
0

ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామిని తాకిన సూర్య కిరణాలు



ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నాడు అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేసింది. మూల విరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. ప్రతి ఏడాది చైత్రమాసంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకడం ఈ ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది. వేంకటేశ్వర స్వామి విగ్రహం నుదిటిన ప్రారంభమై పాదాలను స్పృశించి ఉత్సవమూర్తులను తాకాయి. స్వామి విగ్రహాన్ని తాకిన సూర్యకిరణాలు అనంతరం రెండుగా చీలి పక్కనే ఉన్న అమ్మవారిని కూడా తాకాయి. కానీ ఈ ఏడాది కేవలం స్వామివారిని మాత్రమే సూర్యకిరణాలు తాకడం జరిగింది. ఆ అద్బుత దృశ్యాలను తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.



Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">